నాగ‌బాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక‌వ్వాల్సిందే!

balakrishna smiling photo in nagababu whatsapp dp
balakrishna smiling photo in nagababu whatsapp dp

మెగా బ్ర‌ద‌ర్ గ‌త కొన్ని నెల‌లుగా త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వార్త‌ల్లో నిలుస్తున్నారు అన‌డం కంటే వార్త‌ల‌లో నిల‌వ‌డం కోస‌మే కొత్త పంథాని అనుస‌రిస్తున్నార‌ని చెప్పొచ్చు. ఆ మ‌ధ్య బాల‌కృష్ణ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన ఆయ‌న తాజాగా విల‌న్ వేశాల కోసం త‌న‌ని తాను స‌రికొత్త‌గా మార్చుకుని ప్ర‌త్యేకంగా ఫొటోషూట్‌ల‌కు పోజులివ్వ‌డం.. ఆ ఫొటోలు బ‌య‌టికి రావ‌డం.. వాటిపై చ‌ర్చ జ‌ర‌గ‌డం తెలిసిందే.

తాజాగా మ‌రోసారి మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు వార్త‌ల్లో నిలిచారు. ఈ సారి ఆయ‌న వార్త‌ల్లో నిలిచింది వాట్సాప్ డీపీ వ‌ల్ల‌. ప్ర‌తీ ఒక్క‌రికీ త‌మ‌కు ఇష్ట‌మైన డీపీని పెట్టుకునే అల‌వాటు వుంటుంది. నాగ‌బాబుకి మాత్రం ఈ విష‌యంలో విచిత్ర‌మైన ఆలోచ‌న వ‌చ్చిన‌ట్టుంది. తన ఫొటో. లేదా త‌న‌కు న‌చ్చిన ఫొటో కాకుండా ఏకంగా రామ్‌గోపాల్‌వ‌ర్మ‌, బాల‌కృష్ణ‌ల ఫొటోని త‌న వాట్సాప్ డీపీగా పెట్టుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `ఇన్ స్టాలో `Ask me A Quetion` పేరుతో స‌ర‌దా సంగ‌తులు పంచుకున్నారు. ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్‌.. `మీది ప్రేమ వివాహ‌మా?  లేక పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా? అని ప్ర‌శ్నించ‌డా…త‌న‌ది పెద్ద‌లు కుదిర‌చ్చిన పెళ్లేన‌ని తెలిపారు.

మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా త‌న‌కు న్యూజీలాండ్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని అన్నారు. అనంత‌రం ఓ నెటిజ‌న్ `మీ వాట్సాప్ టీపీ ఏమిటి? అని ప్ర‌శ్నించ‌గా `రామ్‌గోపాల్‌వ‌ర్మ‌, బాల‌కృష్ణ క‌లిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోలో వ‌ర్మ‌తో మాట్లాడుతూ బాల‌య్య ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతున్నారు. ఇది `రైతు` సినిమా కోసం బిగ్‌బి అమితాబ్‌ని ఓ కీల‌క పాత్ర కోసం ద‌ర్శ‌కుడు కృష్ణవంశీ, బాల‌కృష్ణ క‌లిసి ముంబైకి వెళ్లిన‌ప్పుడు వ‌ర్మ‌ని క‌లిశారు. ఆ సంద‌ర్భంగా వ‌ర్మ‌తో బాల‌కృష్ణ మాట్లాడుతున్న‌ప్పుడు క్లిక్ మ‌న్న ఫొటో ఇది. అయితే ఆ ఫొటోని నాగ‌బాబు డీపీగా నిజంగానే పెట్టుకున్నారా?  లేక నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చారా?  అని చ‌ర్చ జ‌రుగుతోంది.