జూనియర్ ఎన్టీఆర్ పై బాలయ్య అల్లుడి సంచలన కామెంట్స్

Balakrishna-Alludu-TDP-doesn’t-need-Jr-NTR
Balakrishna-Alludu-TDP-doesn’t-need-Jr-NTR

జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తెలుగు దేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సేవలు అవసరం లేదని తేల్చి పడేసాడు.

తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ చేరితే మంచిదే అంతేకాని ఎన్టీఆర్ చేరితేనే తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్టకడుతుంది అన్న మాటలను మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే యంగ్ జనరేషన్ అయిన మేము పార్టీకోసం బాగానే కష్టపడుతున్నాం ……. ఇంకా కస్టపడి మరింత బలోపేతం చేస్తామని అన్నాడు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్టణం పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయాడు భరత్.

యితడు బాలకృష్ణ చిన్నల్లుడు అన్న విషయం తెలిసిందే. దాంతో ఓ జర్నలిస్ట్ భరత్ ని తాజాగా ఇంటర్వ్యూ చేసాడు , ఆ ఇంటర్వ్యూలో తెలుగుదేశం బలోపేతం కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడంతో స్పందించిన భరత్ ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది అంతేకాని అతడి వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందంటే ఒప్పుకోను అని ఖరాఖండిగా చెప్పేసాడు బాలయ్య చిన్నల్లుడు.