స్టార్ హీరో అభిమానిగా మారి ర‌చ్చ‌చేస్తే..


Balakrishna surprised evryone at ruler prerelease event
Balakrishna surprised evryone at ruler prerelease event

స్టార్ హీరో తెర‌పై క‌నిపిస్తే అభిమానులు చేసే ర‌చ్చ మామూలుగా వుండ‌దు, పేప‌ర్ ముక్క‌లు చ‌ల్ల‌లు, క‌ల‌ర్ పేప‌ర్‌లు తెర‌పైకి విసిరేయ‌డం చేస్తుంటారు. ఇంకా అభిమానం ఎక్కువైతే థియేట‌ర్ మొత్తం అరుపులతో ద‌ద్దిర‌ల్లాల్సిందే. అచ్చు అలాంటి దృశ్య‌మే `రూల‌ర్‌` ప్రీరిలీజ్ వేడుక‌లో జ‌రిగింది. బాల‌కృష్ణ న‌టింస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `రూల‌ర్‌`. కె.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేదిక‌, సోనాల్ చౌహాన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఈచిత్ర ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి వైజాగ్‌లో జ‌రిగింది. భారీ క్రౌడ్ మ‌ధ్య అభిమానుల అరుపులు కేక‌ల మ‌ధ్య జ‌రిగిన ఈ వేడుక‌లో హీరో బాల‌కృష్ణ చాలా హుషారుగా క‌నిపించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల్ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన బాల‌య్య యంగ్ హీరోల సంద‌డి చేశారు. ఇదే సమ‌యంలో మాట్లాడ‌టానికి వేదిక‌పైకి హీరోయిన్స్ వేదిక‌, సోనాల్ చౌహాన్ వెళుతుంటే బాల‌య్య చేసిన ర‌చ్చ ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్టార్ హీరోయి అయిన బాల‌య్య హీరోయిన్‌ల కోసం ఓ స‌గ‌టు అభిమానిలా మారి కేరింత‌లు కొడుతూ, కేక‌లు వేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

నోటికి రెండు చేతులు అడ్డుపెట్టుకుని కేక‌లు వేస్తూ ఓరేంజ్‌లో బాల‌య్య ర‌చ్చ చేయ‌డం ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. వేదిక తొలిసారి బాల‌య్య‌తో క‌లిసి న‌టిస్తోంది. బాలీవుడ్ హాటీ సోనాల్ చౌహాన్‌కు మాత్రం బాల‌య్య‌తో ఇది మూడ‌వ చిత్రం. వ‌రుస ఫ్లాపుల త‌రువాత బాల‌య్య చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్ర విజ‌యంపై గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నార‌ట‌. ఈ నెల 20నే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది.