మళ్ళీ బాలయ్యతో బోయపాటి


Nandamuri Balakrishna teamup with again boyapati srinu
Nandamuri Balakrishna and Boyapati srinu

నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే మళ్ళీ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది . నిన్న జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో హ్యాట్రిక్ చిత్రం కోసం శ్రీకారం చుడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు . అంతేకాదు ఈ సినిమాని బాలయ్య స్వయంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించడం విశేషం .

ఇంతకుముందు బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ లో సింహా , లెజెండ్ చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . బాలయ్య ని ఎలా చూపిస్తే అభిమానులు సంతోషానికి లోనౌతారో బోయపాటి కి బాగా తెలుసు కాబట్టి మళ్ళీ ఈ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు . లెజెండ్ తర్వాత మళ్ళీ దాదాపు ఐదేళ్లకు ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రాబోతోంది . 2019 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కానుంది . సింహా , లెజెండ్ చిత్రాలకు మించి మూడో సినిమా ఉంటుందని అంటున్నాడు బోయపాటి , మరి బాలయ్య అభిమానులకు కావాల్సింది అదేగా !

English Title: Nandamuri Balakrishna teamup with again boyapati srinu