గుండు పిక్ తో షాకిస్తున్న బాలయ్య


గుండు పిక్ తో షాకిస్తున్న బాలయ్య
గుండు పిక్ తో షాకిస్తున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణకు 2019 అస్సలు కలిసి రాలేదు. 2019లో బాలయ్యవి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్. అయితే ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. అంతే కాకుండా బాలయ్య కెరీర్ లోనే దారుణమైన డిజాస్టర్స్ ఖాతాలో జమయ్యాయి. ఇదిలా ఉంటే బాలకృష్ణ 2020ను అదిరిపోయేలా మొదలుపెట్టాలనుకుంటున్నాడు. ఇప్పటికే తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో జతకట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ ఇద్దరూ సింహా, లెజండ్ లతో రెండు బ్లాక్ బస్టర్లను అందించారు. ఇప్పుడు మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. 2019లోనే ఈ సినిమాకు ముహూర్తం నిర్వహించిన సంగతి తెల్సిందే. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది, ఏ రకంగా తమ హీరోని బోయపాటి చూపించనున్నాడు అంటూ బాలయ్య అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే నిన్నటి నుండి సోషల్ మీడియాలో బాలయ్య గుండు లుక్ ఒకటి తెగ హల్చల్ చేస్తోంది. గుండుతో ఉన్న బాలయ్య, నల్లటి మీసాలు, తెల్లటి గెడ్డంతో పవర్ఫుల్ గా ఉన్నాడు. ఈ లుక్ బాలయ్యకు భలే సెట్ అయిందని చెప్పవచ్చు. అయితే ఇదే లుక్ ను బోయపాటి శ్రీను సినిమాకు కంటిన్యూ చేయనున్నాడా లేక మరో కొత్త లుక్ కోసం జుట్టు చేయించాడా అన్నది తెలియలేదు. కాకపోతే ఇదే బాలయ్య 106వ సినిమా లుక్ అంటూ తెగ ప్రచారమైపోతోంది.

రూలర్ సినిమాలో బాలయ్య లుక్స్, ముఖ్యంగా హెయిర్ స్టైల్ గా చాలానే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి జాగ్రత్తలు మరింత ఎక్కువ తీసుకుంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిననున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. ఇంకా హీరోయిన్ ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. బాలయ్య 106వ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.