బోయపాటి సినిమాలో బాలయ్య త్రిపాత్రాభినయం ?


Balakrishna tripule role in boyapati' s next film
Nandamuri Balakrishna and Boyapati Srinu

బోయపాటి సినిమాలో బాలయ్య : నటసింహం నందమూరి బాలకృష్ణ ని ఎలా చూపిస్తే అభిమానులు పులకించి పోతారో దర్శకులు బోయపాటి శ్రీను కు బాగా తెలుసు అందుకే బాలయ్యకు అతడిపై బాగా గురి . ఇప్పటికే సింహా , లెజెండ్ చిత్రాలతో బంపర్ హిట్స్ ఇచ్చాడు బోయపాటి దాంతో హ్యాట్రిక్ కోసం మళ్ళీ బోయపాటి తో జత కలుస్తున్నాడు బాలయ్య . ఇటీవల జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో బాలయ్య – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో మూడో సినిమాని ప్రకటించారు .

ఇక బోయపాటి అయితే సింహా , లెజెండ్ లను మించి ఈ మూడో చిత్రం ఉంటుందని అన్నాడు . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య త్రిపాత్రాభినయం పోషించనున్నట్లు తెలుస్తోంది . ఇంతకుముందు బాలయ్య త్రిపాత్రాభినయం పోషించిన అధినాయకుడు డిజాస్టర్ అయ్యింది . అయినప్పటికీ బోయపాటి మీద ఉన్న నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య . ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అయ్యాక ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . బోయపాటి కూడా చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంతో బిజీ గా ఉన్నాడు . ఆ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది .

English Title: Balakrishna tripule role in boyapati’ s next film