బాలయ్య కూతురు కూడా రాజకీయాల్లోకి


balakrishnas daughter brahmani to contest from chittoor

నటసింహం నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రానున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి అయితే అవి నిజమే అని మరోసారి తాజాగా వినబడుతోంది . హెరిటేజ్ సంస్థ నిర్వహణా సామర్ధ్యంతో బ్రాహ్మణి తన సత్తా ఏంటో చూపించింది . హెరిటేజ్ సంస్థ ని లాభాల్లోకి తీసుకురావడమే కాకుండా మార్కెట్ లో షేర్ వేల్యూ కూడా గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే దాంతో బ్రాహ్మణి తెలివి తేటలు ఒక్క వ్యాపారానికే పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా వాడుకోవాలని ఆలోచన చేస్తున్నారట బాలయ్య అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .

చిత్తూర్ జిల్లా వ్యాస్తవ్యుడు చంద్రబాబు కాబట్టి ఆ జిల్లా నుండే బ్రాహ్మణి ని పోటీ చేయించాలని భావిస్తున్నారట . చంద్రగిరి నియోజకవర్గం నుండి బ్రాహ్మణి ని పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసున్నాడట బాబు . అయితే బ్రాహ్మణి అభిప్రాయం తీసుకున్నాక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు బాలయ్య , చంద్రబాబు లు . అటు తండ్రి కుటుంబం ఇటు మామ కుటుంబం రాజకీయాల్లో ఉంది కాబట్టి బ్రాహ్మణి కూడా రాజకీయాల పట్ల మొగ్గు చూపుతుందేమో చూడాలి .

English Title: balakrishnas daughter brahmani to contest from chittoor