బాలయ్య వెనక్కి తగ్గడం కరక్టేనా?


బాలయ్య వెనక్కి తగ్గడం కరక్టేనా?
బాలయ్య వెనక్కి తగ్గడం కరక్టేనా?

నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఏ మాత్రం కుదిరినా తన సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని అనుకుంటాడు. సంక్రాంతి సీజన్ కు మంచి రికార్డే ఉన్న బాలకృష్ణ ఈసారి ఎందుకో అసలు పెద్ద పండగకు విడుదలను అసలు ఆప్షన్ గానే పెట్టుకోలేదు. మొదటినుండి కూడా ఈ సినిమా సంక్రాంతికి రాదనే భావనే కలిగించారు నిర్మాతలు. అనుకున్నట్టుగానే బాలయ్య – కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న రూలర్ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది.

సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి టాప్ హీరోలు వస్తుండడంతో వారితో పోటీ అంత మంచిది కాదని బాలకృష్ణ భావించినట్టు తెలుస్తోంది. దానికి బదులుగా క్రిస్మస్ సీజన్ లో డిసెంబర్ 20 – 25 మధ్య సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నారు. డిసెంబర్ 20 రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు.

అయితే క్రిస్మస్ సీజన్ కు కూడా పోటీ గట్టిగానే ఉంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న రానుందని ప్రకటించారు. రవితేజ డిస్కో రాజా కూడా ఈ డేట్ నే టార్గెట్ గా పెట్టుకుని ముస్తాబవుతోంది. ఇక బాలకృష్ణ చిత్రం కూడా వస్తే ఇంకా క్రిస్మస్ సీజన్ కూడా రంజుగా మారుతుంది అనడంలో సందేహం లేదు.