బాలయ్య – బోయపాటి మూవీపై తాజా అప్డట్ ఇదే!


బాలయ్య - బోయపాటి మూవీపై తాజా అప్డట్ ఇదే!
బాలయ్య – బోయపాటి మూవీపై తాజా అప్డట్ ఇదే!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు మొదలై ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన పార్ట్ నుండే బాలయ్య పుట్టినరోజుకు చిన్న టీజర్ ఒకటి వదిలారు. ఆ టీజర్ లోని డైలాగ్, బాలయ్య లుక్ కూడా అదిరిపోవడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భరోసా పెట్టుకున్నారు.

ఇక వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టైటిల్ విషయంలో బోయపాటి – బాలయ్య ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా డేంజర్ అనే టైటిల్ పై ఇద్దరూ లాక్ అయ్యారట. గతంలో కృష్ణవంశీ డేంజర్ అనే టైటిల్ తో ఒక సినిమా తీసాడు. అయితే అది అనుకున్నంతగా ఆడలేదు.

ఇక బాలయ్య – బోయపాటి సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో ఒక కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. థమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.