రికార్డ్ స్పీడ్ తో బాలయ్య – బోయపాటి మూవీ షూటింగ్


రికార్డ్ స్పీడ్ తో బాలయ్య - బోయపాటి మూవీ షూటింగ్
రికార్డ్ స్పీడ్ తో బాలయ్య – బోయపాటి మూవీ షూటింగ్

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు హిట్ కొట్టాలని మాంచి కసి మీద ఉన్నాడు. గతేడాది మూడు సినిమాలతో అభిమానులను నిరాశపరిచిన బాలయ్య, అంతకు రెట్టించిన హిట్ తో వారిని ఉర్రూతలూగించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఎప్పుడూ లేనిది తన సినిమా మొదలుకావడానికి సమయం తీసుకుంటున్నాడు. అంతా పక్కా అనుకున్నాకే ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. బడ్జెట్ నుండి మొదలుకుని ప్రతిదీ ఒకటి పదిసార్లు చెక్ చేసుకున్నాకే ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు వెళుతున్నారు. ఇప్పటికే మార్చ్ 2 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందన్న న్యూస్ బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.

ఐతే మొదలవ్వడమే లేట్ కానీ రిలీజ్ లో మాత్రం లేట్ ఉండదని అంటున్నారు బాలయ్య అండ్ బోయపాటి. ఈ చిత్రాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కేవలం 2 రెండు నెలల 15 రోజుల వర్కింగ్ డేస్ లో ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే లేట్ సమ్మర్ కు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. దసరా సీజన్ ను మిస్ అవ్వకూడదని ఈ టీమ్ నిర్ణయం తీసుకుంది.

భారీ యాక్షన్ సన్నివేశాలున్నా కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్న కారణంగా ఈ సినిమా షూటింగ్ లో జాప్యం ఉండదని, దసరాకు కచ్చితంగా సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అంజలి ఒక కథానాయికగా ఎంపికైన విషయం తెల్సిందే. మరో హీరోయిన్ ను ప్రకటించాల్సి ఉంది.

ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, బాలయ్య బంగారు బుల్లోడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ స్వాతిలో ముత్యమంత ను రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య కవలలుగా కనిపించనున్న విషయం కూడా ఇప్పటికే లీకైంది. అందులో ఒక పాత్ర అఘోరగా ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య భారీ హిట్ కొట్టి తన విమర్శకులకు సమాధానం చెబుతాడేమో చూడాలి.