పవన్ కళ్యాణ్ పై సెటైర్ ఉంటుందట ఆ చిత్రంలో


balayya new film based on pawan kalyan criticismనటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన రెండు చిత్రాలు సింహా , లెజెండ్ సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు ఆ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రానుంది , ఇక ఈ చిత్రానికి పూర్తిగా రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకున్నారని సమాచారం . బాలయ్య ఎలాగూ రాజకీయాల్లో ఉన్నాడు అలాగే 2019 లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి దాంతో బాలయ్య తో పాటుగా తెలుగుదేశం పార్టీ కి కూడా లాభం చేకూరేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి శ్రీను .

బాలయ్య ప్లాప్ లలో ఉన్న సమయంలో సింహా తో తిరుగులేని విజయాన్ని ఇచ్చాడు బోయపాటి , ఆ తర్వాత లెజెండ్ తో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దాంతో బోయపాటి అంటే బాలయ్య కు ఎనలేని అభిమానం . బోయపాటి చెప్పే కథ కు బాలయ్య ఒప్పుకోవడం ఖాయం ఇది కూడా రాజకీయ నేపథ్యంలో తీస్తే అటు బాలయ్య కు ఇటు తెలుగుదేశం పార్టీ కి కూడా ప్రయోజనకారి గా ఉంటుందని భావిస్తున్నారట . ఇక ఈ సినిమాలో రాజకీయ ప్రత్యర్థులైన జగన్ తో పాటుగా పవన్ కళ్యాణ్ పై కూడా సెటైర్ లు ఉంటాయని వినికిడి . పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను గా నిలిచాడు కట్ చేస్తే గతకొంత కాలంగా తెలుగుదేశం పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు దాంతో పవన్ కళ్యాణ్ పై సెటైర్ లు ఉంటాయని తెలుస్తోంది .

English Title: balayya new film based on pawan kalyan criticism