సెప్టెంబర్ 5నుండి షూటింగ్ లోకి ఎంటర్ అవుతోన్న బాలయ్య!


Balakrishna Sonal Chouhan
Balakrishna Sonal Chouhan

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న భారీ చిత్రం షె షెడ్యూల్ మలేషియాలో పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ చిత్రం తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 5నుండి రామోజీ ఫిలింసిటీలో జరగనుంది. వినాయక చవితి పండగ సందర్భాన్ని పురస్కరించుకొని హీరో బాలయ్య, హీరోయిన్ సోనాల్ చౌహన్ పోస్టర్ విడుదలచేశారు.

వీటికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య ఫ్రెంచ్ గడ్డం తో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సోనాల్ చౌహాన్ గ్లామరస్ గా షార్ట్ డ్రెస్ వేసుకొని తన అందాలన్నీ ఆరబోస్తుంది.

ఇక ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలయ్య కనిపిస్తారని వినికిడి. ఆయన నటిస్తోన్న 105వ చిత్రమిది. రూలర్ టైటిల్ పరిశీలనలో వున్న ఈ చిత్రంలో -ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా, తదితరులు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ బట్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రాంప్రసాద్ ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు..!