తనకంత మార్కెట్ లేదని ఒప్పుకున్న బాలయ్య


Balakrishna
తనకంత మార్కెట్ లేదని ఒప్పుకున్న బాలయ్య

ఏ హీరోకైనా రియాలిటీ చెక్ అనేది అత్యంత కీలకం. తన రేంజ్ ఎంతో, తన సినిమాకి బడ్జెట్ ఎంతవరకూ పెట్టచ్చో ప్రతి హీరోకి ఒక అవగాహన ఉండాలి. లేదంటే నష్టపోయేది ఆ హీరోలే. ఈ విషయంలో బాలయ్య ఖరీదైన గుణపాఠమే నేర్చుకున్నాడు. ఇటీవలే బోయపాటి, బాలయ్యకు కథ చెప్పి భారీ బడ్జెట్ ను ప్రతిపాదించాడట. 45 నుండి 50 కోట్ల వరకూ సినిమాకి అవుతుందని చెప్పాడట బోయపాటి. అయితే దీనికి బాలయ్య ససేమీరా అన్నట్టు తెలుస్తోంది.

తనకున్న మార్కెట్ ను బట్టి 30 నుండి 35 కోట్లలో సినిమాను పూర్తి చేయమని ఆర్డర్స్ పాస్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఏదో లెజండ్, సింహా వంటి సినిమాలకు వచ్చాయి కదా అని ప్రతి సినిమా 50 కోట్లపైన వసూలు చేయాలంటే అయ్యే పని కాదని బాలయ్యకు అర్ధమైంది. గౌతమీపుత్ర శాతకర్ణికి సినిమా బాగుందని టాక్ వచ్చినా అధిక బడ్జెట్ కారణంగా ప్లాప్ లిస్ట్ లో వేయాల్సి వచ్చింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. దానికైన బడ్జెట్ కు, వచ్చిన కలెక్షన్స్ కు ఎక్కడా పొంతన లేదు. వీటితో బాలయ్యలో గట్టి మార్పే వచ్చింది. తన సినిమాల బడ్జెట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు.