నోటా చిత్రాన్ని బ్యాన్ చేయమంటున్నాడు


Ban demond on nota film

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా చిత్రాన్ని తెలంగాణలో విడుదల చేయొద్దని , దాన్ని బ్యాన్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. దర్శకుడు తేజ కు బంధువైన కేతిరెడ్డి ప్రస్తుతం చెన్నై లోనే ఉంటున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతున్న నోటా చిత్రాన్ని కేవలం ఒక పార్టీకి అనుకూలంగా నిర్మించారని , కాబట్టి నోటా చిత్రాన్ని విడుదల చేయొద్దని అంటున్నాడు అంతేనా …….. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున నోటా చిత్రాన్ని విడుదల చేయకుండా ముందుగా ఎన్నికల అధికారులు సినిమా చూడాలని , ఆ తర్వాత ఫరావలేదని అనుకుంటే మాత్రమే విడుదలకు అనుమతి ఇవ్వాలని లేనిపక్షంలో ఎన్నికలు అయ్యాక అప్పుడు మాత్రమే విడుదల చేసుకునేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు .

అన్నింటికీ బెస్ట్ సొల్యూషన్ ఇంకా బ్యాన్ చేస్తే బెటర్ అని డిమాండ్ చేస్తున్నాడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి . విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా చిత్రాన్ని ఈనెల 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా ఈ నోటా చిత్రాన్ని నిర్మించాడు. విజయ్ సరసన మెహరీన్ కౌర్ నటించింది.

English Title: Ban demond on nota film