ఐసీయూలో చేరిన బండ్ల గ‌ణేష్‌!

ఐసీయూలో చేరిన బండ్ల గ‌ణేష్‌!
ఐసీయూలో చేరిన బండ్ల గ‌ణేష్‌!

న‌టుడు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. `వ‌కీల్ సాబ్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో `ప‌వ‌న్‌స్టార్ అంటే ఓ వ్య‌స‌నం` అని వీర‌లెవెల్లో స్పీచ్ ఇచ్చి ప‌వ‌ర్‌స్టార్‌ని విమ‌ర్శించే వాళ్ల‌ని ల‌ఫూట్స్ అంటూ ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఇంత‌లా హంగామా సృష్టించిన బండ్ల గ‌ణేష్ తాజాగా అవ్ర అనారోగ్యానికి గుర‌య్యారిన తెలుస్తోంది.

దీంతో ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ హాస్పిట‌ల్‌లో ఐసీయూలో చేరిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. కార‌ణం ఆయ‌న‌కు మ‌రోసారి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింద‌ని, ఆ కార‌ణంగానే ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. గ‌తంలో బండ్ల గ‌ణేష్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న కోవిడ్ బారిన ప‌డ్డార‌ట‌.

ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయ‌న‌ని వెంట‌నే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లోని ఐసీయూలో చేర్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది వ‌రుస‌గా కోవిడ్‌బారిన ప‌డుతున్నారు. త్రి‌విక్ర‌మ్‌, నివేదా థామ‌స్‌, దిల్ రాజు ఇటీవ‌ల త‌న సిబ్బందికి కోవిడ్ సోక‌డంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ హోమ్ క్వారెంటైన్‌కి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే.