వైర‌ల్‌గా మారిన బండ్ల గ‌ణేష్ ఏమోష‌న‌ల్ వీడియో!


వైర‌ల్‌గా మారిన బండ్ల గ‌ణేష్ ఏమోష‌న‌ల్ వీడియో!
వైర‌ల్‌గా మారిన బండ్ల గ‌ణేష్ ఏమోష‌న‌ల్ వీడియో!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ వీరాభిమాని అన్న విష‌యం తెలిసిందే. అభిమానులు ఎంత మంది వున్నా వారంద‌రిని మ‌రిపించి అభిమానం కురిపించ‌డంలో బండ్ల గ‌ణేష్ ముందుంటారు. స‌మ‌యం సంద‌ర్భం అనేది వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్‌పై బండ్ల కురిపించే అభిమానం, ఆయ‌న స్పీచ్ న‌వ్వులు కురిపిస్తుంటుంది.

`ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండాలని చిన్న కోరిక.. ఉంటాన‌నే చిన్న ఆశ… ద‌గ్గ‌ర వుంటే మిమ్మ‌ల్ని ముద్దు పెట్టుకోవాల‌నిపిస్తుంది. ఎమీరు నా ప్రాణం. బాబూ అంద‌రి ఆశీస్సులు తీసుకుని మీరు చ‌ల్ల‌గా వుండాలి` `గ‌బ్బ‌ర్‌సింగ్`ఆడియో రిలీజ్‌లో న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌నిఉద్దేశిస్తూ భావోద్వేగంగా మాట్లాడిన మాట‌లివి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సెప్టెంబ‌ర్ 2 ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో అప్పుడే సోష‌ల్ మీడియాలో హంగామా మొద‌లుపెట్టారు. బండ్ల గ‌ణేష్ ఎమోష‌న‌ల్ అయ్యిన వీడియోని ప‌వ‌న్ అభిమాని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని బండ్ల గ‌ణేష్‌కు ట్యాగ్ చేశాడు. ఇదే వీడియోని రీ ట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్ #AdvanceHBD@pawankalyan garu అంటూ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం బండ్ల‌కు సంబంధించిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.