కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పవన్ కళ్యాణ్ భక్తుడు


Bandla ganesh eyes on politicsజనసేన అధినేత పవన్ కళ్యాణ్ భక్తుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు . పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా తనని తానే ప్రకటించుకున్న వ్యక్తి బండ్ల గణేష్ . హాస్య నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నిర్మాతగా సుపరిచుతుడు బండ్ల గణేష్ . పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే బండ్ల గణేష్ జనసేన పార్టీలో చేరాలి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏంటో ? అయినా జనసేన పార్టీ తెలంగాణలో ఊసే లేకుండా పోయింది దాంతో కాబోలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . త్వరలో జరగబోయే శానససభ ఎన్నికల్లో షాద్ నగర్ నుండి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు బండ్ల గణేష్ .

తెలుగులో పలు చిత్రాల్లో నటించి, నిర్మించిన బండ్ల గణేష్ వ్యాపార రంగంలో కూడా రాణించాడు దానికి తోడు బొత్సా సత్యనారాయణకు దగ్గరి వ్యక్తి కూడా అయితే ప్రస్తుతం బొత్సా సత్యనారాయణ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు . ఇలా తనకు బాగా ఆత్మీయులైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో ఊసులో లేకుండాపోవడం , వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా పోవడంతో కాబోలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు . షాద్ నగర్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నాడు . కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేష్ కు టికెట్ ఇస్తుందా ? టికెట్ వచ్చినా ప్రజలు గెలిపిస్తారా ? చూడాలి .

English Title: Bandla ganesh eyes on politics