బండ్ల గణేష్ ఫ్యామిలీకు కరోనా నెగటివ్


బండ్ల గణేష్ ఫ్యామిలీకు కరోనా నెగటివ్
బండ్ల గణేష్ ఫ్యామిలీకు కరోనా నెగటివ్

టాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటిదాకా టాలీవుడ్ కు అంటని కరోనా మహమ్మారి ఇప్పుడు ఎంటర్ అవ్వడంతో అందరూ కంగారు పడుతున్నారు. అసలు బండ్ల గణేష్ కు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్ అని తేలింది. హాస్పిటల్ కు జనరల్ చెకప్ కు బండ్ల గణేష్ వెళ్లగా అక్కడి డాక్టర్లు కరోనా టెస్ట్ చేయించుకోమని సూచించారట. ఆ పరీక్షల్లో బండ్ల గణేష్ కు పాజిటివ్ అని వచ్చిన సంగతి తెల్సిందే.

తనకు పాజిటివ్ అని తెలియగానే తన కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేయించాడట బండ్ల గణేష్. ఇటీవలే వారి రిపోర్టులు రాగా వారందరికీ కరోనా నెగటివ్ అని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో బండ్ల గణేష్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

తన కుటుంబ సభ్యుల తర్వాత తన స్టాఫ్ అందరికీ కరోనా టెస్టులు చేయించాడు బండ్ల గణేష్. అయితే వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. గణేష్ కు పాజిటివ్ రావడంతో అతని చుట్టుపక్కల నివసించే వాళ్ళు కూడా కరోనా టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. హీరో నాగ శౌర్య కూడా అదే ఏరియాలో ఉంటాడు. తను కూడా కుటుంబ సభ్యులతో కరోనా టెస్టులు చేయించుకోనున్నాడు.