“బాద్షా” నిర్మాత రీ ఎంట్రీ!! బండ్ల గణేష్


Bandla Ganesh Joins in Sarileru Neekevvaru movie
Bandla Ganesh Joins in Sarileru Neekevvaru movie

“బాద్షా” నిర్మాత రీ ఎంట్రీ!!

బండ్ల గణేష్.. ఈ పేరు తెలీని ప్రేక్షకులు, నెటిజన్లు అంటూ ఎవరు లేరు.. సోషల్ మీడియాలో ఆయనకున్నంత పాపులారిటీ, క్రేజ్ అంతా, ఇంతా కాదు. కమీడియన్ గా సినీ ఇండస్ట్రీలో కేరీర్ ప్రారభించి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.. బండ్ల గణేష్. నిర్మాతగా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ తో బాద్షా రాంచరణ్ తో గోవిందుడు అందరివాడేలే వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. కొద్ధి కాలం గ్యాప్ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎలెక్షన్లో హాట్ టాపిక్ ప్రసంగాలు చేసారు. ఫైనల్ గా ఆ పార్టీకి రాజీనామా చేసారు. చాలా సంవత్సరాల తర్వాత నటనకి స్వస్తి చెప్పిన బండ్ల గణేష్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం లో బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్లగణేష్ నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ప్రేస్టీజియస్ గా రూపొందిస్తున్నారని తెలిసింది!!