బండ్ల గణేష్ పరారీ… గాలిస్తున్న పోలీసులు


బండ్ల గణేష్ పరారీ... గాలిస్తున్న పోలీసులు.
బండ్ల గణేష్ పరారీ… గాలిస్తున్న పోలీసులు.

‘బండ్ల గణేష్’ ఒకప్పుడు ఇతగాడి పేరు సినిమాలో హాస్య కథానాయకుడిగా మాత్రమే తెలుసు. చేసిన సినిమాలు కూడా తక్కువే, అందుకేనేమో హాస్యానికి ముగింపు చెప్పి నిర్మాత అయ్యాడు. మాస్ మహారాజ్ ‘రవితేజ’ తో కలిసి ‘ఆంజనేయులు’ సినిమాని 2009 లో నిర్మించారు. మొదటి సినిమాకి పెట్టిన పెట్టుబడి నేలపాలు అయ్యింది. సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.

తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ‘గబ్బర్ సింగ్’ సినిమాని నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకోకుండా పెద్ద హీరోలతో సినిమాలని నిర్మించారు బండ్ల గణేష్ గారు. ‘జూ.ఎన్.టి.ఆర్’ తో కూడా 2 సినిమాలని నిర్మించారు. ‘టెంపర్’ సినిమాకి పెట్టిన డబ్బుల విషయంలో ఇంకొక నిర్మాతని డబ్బులు అడిగారు. ఆ సమస్య ఇప్పుడు పెద్దది అయ్యింది.

పి.వి.పి సినిమా నిర్మాత అయిన ఒకరు ‘పరం వి. పొట్లూరి’ ని మన బండ్ల గణేష్ గారు 30 కోట్లు డబ్బు అడిగారు అంటా, సినిమా వచ్చి దాదాపు 4,5 సంవత్సరాలు అవుతున్న ఎంతకీ డబ్బులు ఇవ్వకపోయే సరికి పొట్లూరి గారు ఈ మధ్య కొంచెం గట్టిగా అడిగేసరికి బండ్ల గణేష్ గారు పొట్లూరి ఇంటికి మనుషులని పంపించి బెదింరించారు అంటా. అయితే వెంటనే పొట్లూరి గారు నిన్న శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులని ఆశ్రయించి బండ్ల గణేష్ మీద కేసు నమోదు చేపించారు.

రంగం లోకి దిగిన పోలీసులు గణేష్ ఇంటికి వెళ్లేసరికి పరారీలో ఉన్నారు అని తెలిసింది. అసలు గణేష్ ఇలా చేయడం ఏంటి అని సినిమా వర్గాలకి సంబంచించిన వారు అనుకుంటున్నాయి. ఇంతకు ముందు కూడా గ్రేట్ బిజినెస్ మేన్ కం నటుడు అయిన ‘సచిన్ జోషి’ తో ‘ముంబై పాన్ మసాలా వాలా’ సినిమాకి ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు వచ్చాయి ఇరువురు మీడియా ముందు గొడవపడ్డారు అని మనకి తెలిసిందే కదా. ఇప్పుడు ఇంకొక రకంగా వార్తల్లో నిలిచాడు మన గణేష్ గారు.

ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో మంచి హాస్య కథానాయకుడిగా నటిస్తున్నారు గణేష్ గారు. ఒకవేళ గణేష్ గారికి సంబంధించిన సన్నివేశాలు ఇంకా ఉన్నాయా? ఉంటే గణేష్ వెలుగులోకి వచ్చేంత వారికి సినిమా ఆగిపోయే సమస్య ఏమన్నా ఉందా? అని ఆలోచిస్తున్నారు గణేష్ అభిమానులు మరియు మహేష్ అభిమానులు.