ఐసీయూ నుంచి బ‌య‌టికొచ్చిన బండ్ల గ‌ణేష్‌!

ఐసీయూ నుంచి బ‌య‌టికొచ్చిన బండ్ల గ‌ణేష్‌!
ఐసీయూ నుంచి బ‌య‌టికొచ్చిన బండ్ల గ‌ణేష్‌!

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ సెకండ్ వేవ్ కార‌ణంగా మ‌రోసారి కోవిడ్ బారిన ప‌డ్డారు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆయ‌న‌ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియులో చేశారు. గ‌త రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న బండ్ల గణేష్ ఆరోగ్యం పురోగతి సాధించిన‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న‌‌ను ఐసియు నుంచి జనరల్ వార్డుకు తరలించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

గణేష్ కుటుంబం కూడా అతను చికిత్సకు స్పందిస్తున్నాడని, అయితే ఆయ‌న‌ కోలుకోవడానికి సమయం పడుతుందని అన్నారు. ఇదిలా వుంటే బండ్ల గ‌ణేష్ ఐసియు నుండి బయటపడటంతో కుటుంబం స‌భ్యులు ఊప‌రి పీల్చుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరైన తర్వాత నిర్మాత కోవిడ్ బారిన ప‌డిన‌ట్లు తెలిసింది.

ఆ త‌రువాత చేసిన టెస్టుల్లో పాజిటివ్ గా తేల‌డం, బండ్ల గ‌ణేష్ తీవ్ర అస్వ‌స్థ‌కు గురి కావ‌డంతో ఐసీయులో చేర్చారు. గణేష్ కు కోవిడ్ లక్షణాలు తీవ్రంగా వుండ‌టంతో అసౌకర్యానికి గుర‌య్యార‌ట‌. దీంతో ఆయ‌న‌నికుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ని ఆసుపత్రికి తరలించారు. స‌రీస్థితి గ‌మ‌నించిన డాక్ట‌ర్లు బండ్ల గ‌ణేష్‌ను వెంటనే ఐసియులో చేర్చార‌ట‌.