బండ్ల గ‌ణేష్ సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు!


బండ్ల గ‌ణేష్ సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు!
బండ్ల గ‌ణేష్ సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు!

నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల జ‌రిపిన క‌రోనా వైర‌స్ టెస్టుల్లో పాజిటివ్ అని రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ప‌ది రోజుల క్రితం జీహెచ్ ఎంసీ ప‌రిధిలో చేసిన టెస్టుల్లో నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు క‌రోనా సోకిన‌ట్టు తేలింది. దీంతో బండ్ల‌తో స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించిన వారంతా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ‌కు కూడా వైర‌స్ సోకిందేమోన‌ని భ‌య‌ప‌డ్డారు. అయితే తాజాగా ఈ రోజు అపోలో ఆసుప‌త్రి వ‌ర్గాలు చేసిన టెస్టులో బండ్ గ‌ణేష్‌కు నెగెటివ్ రావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ రోజు వ‌చ్చిన రిపోర్ట్‌లో త‌న‌కు నెగెటివ్ వ‌చ్చంద‌ని రిపోర్ట్ కాపీని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసిన బండ్ గ‌ణేష్ థ్యాంక్స్ గాడ్ అంటూ కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌కు క‌రోనా సోకింద‌ని తెలిసిన వెంట‌నే స్వీయ నిర్భంధంలోకి వెళ్ళిన బండ్ గ‌ణేష్ 27 నుంచి వ‌రుస‌గా మూడు రోజుల పాటు టెస్టులు చేయించుకున్నారు.

పైన‌ల్‌గా మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌చ్చిన రిపోర్ట్‌లో నెగెటివ్ రావ‌డంతో బండ్ల ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో ఈ విష‌యాన్ని నెటిజ‌న్‌ల‌తో షేర్ చేసుకున్నారు.