దారుణంగా దెబ్బతిన్న సూర్య మార్కెట్Bandobast
Bandobast

తమిళ్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. అప్పట్లో సూర్య ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండేది కాదు. ఒక తెలుగు హీరోకి ఏ మాత్రం తగ్గని హంగామా సూర్య సినిమాకి కూడా ఉండేది. అయితే గత కొన్ని సినిమాలుగా సూర్య కథల ఎంపికలో చేస్తున్న తప్పుల కారణంగా వరస పరాజయాలు చవిచూసి ఇక్కడ మార్కెట్ ను దెబ్బ తీసుకున్నాడు.

ఈ ఏడాది విడుదలైన సూర్య సినిమా ఎన్జీకే సూర్య కెరీర్ లో అతి తక్కువ కలెక్షన్స్ అనుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన బందోబస్త్ అంతకంటే తక్కువ కలెక్షన్స్ సాధించి సూర్య మార్కెట్ ఇంకా పడిపోయిందని నిరూపించింది.

బందోబస్త్ చిత్రం మొదటిరోజు కేవలం తెలుగులో 2 కోట్ల గ్రాస్ సాధిస్తే, తొలి వారాంతం ముగిసేసరికి 4 కోట్లు కూడా దాటలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల వరకూ జరిగిన ఈ సినిమాను కొన్న బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.