ఏంది..? వాల్మీకి, బందోబస్త్ దెబ్బకి ?


bandobasth and Valmiki
bandobasth and Valmiki

శుక్రావారం కాని సినిమా విడుదల అవుతుంది అంటే గురువారం ముందు రాత్రి నుండే కొంతమంది సినిమా చూసినా, చూడకపోయినా, సినిమా అలా ఉంది, ఇలా ఉంది అని కొంతమంది రివ్యూ పట్టుకొని మాది నిజమైనా రివ్యూ అంటే కాదు మాది నిజమైనా రివ్యూ అని కొట్టుకోవడం చూసాం.

కానీ ఈరోజు తమిళ నుండి ఒక సినిమా, తెలుగు నుండి ఒక సినిమా విడుదల. ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. నిజానికి (వాల్మీకి) “గద్దలకొండ గణేష్” సినిమాకే ఎక్కువ అవకాశం ఉంది, కానీ “సూర్య, మోహన్ లాల్, ఆర్య” ఇలా అందరూ నటించిన “బందోబస్త్” సినిమాకి అసలు ప్రమోషన్స్ కాదు కదా, సినిమా ఒకటి ఉంది అనికూడా తెలవదు.

ఆఖరి నిమిషం వరకు ఏమి తెలవదు, వాల్మీకి సినిమాకి టిక్కెట్ దొరక్కపోతే ఇంక అవకాశం సూర్య సినిమాకే కదా. మనం ఎంత చేసినా సినిమాని ప్లాప్ చెయ్యలేం, హిట్టు చెయ్యలేం. అది అంత థియేటర్ నుండి వచ్చిన ప్రేక్షకుల రివ్యూ ని బట్టి ఉంటుంది.

నిజానికి బందోబస్త్ కి కుడా నెమ్మదిగా జనాలు ఆకర్షితులు అవుతున్నారు, కారణం వాల్మీకి నుండి గద్దలకొండ గణేష్ అవ్వడం, వాల్మీకి సినిమాకి ఒక అడ్డం అని ఎందుకు మనకి ఈ గొడవలు మంచిగా సూర్య సినిమాకి పోదాం పదా అని కూడా కొంతమంది ఉన్నారు.

ఇప్పుడు ఆ కొంతమంది థియేటర్ నుండి బయటికి రాగానే “బందోబస్త్” సినిమా గురించి మంచిగా చెప్తున్నారు. కారణం సూర్య, ఆర్య, మోహన్ లాల్ మరియు తమిళ దర్శకుడు “కె.వి.ఆనంద్” అని అంటున్నారు.

మరి అసలుసిసలైన, నిజమైన ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూ మరి కొద్ది గంటల్లో మనకి వస్తుంది. ఏ సినిమా హిట్టు, ఏ సినిమా ఫట్టు అని వేచి చూద్దాం.