బందోబస్త్‌ సినిమా అపజయానికి కారణం వీళ్ళే అంటున్న ఫ్యాన్స్.


Bandobast
బందోబస్త్‌ సినిమా అపజయానికి కారణం వీళ్ళే అంటున్న ఫ్యాన్స్

మన తెలుగు సినిమా “గద్దలకొండ గణేష్” కి ధీటుగా తమిళ సినిమా “సూర్య” నటించిన “బందోబస్త్‌” నిన్న థియేటర్ లో సందడి చేసింది, అయితే తెలుగు సినిమా గద్దలకొండ గణేష్ కి, బందోబస్త్‌ కి రెండు సినిమాలకి ఆదరణ ఒకేలా ఉన్న గద్దలకొండ గణేష్ సినిమా చేసిన హడావిడికి బందోబస్త్‌ కుప్పకూలిపోయింది.

నిజానికి బందోబస్త్‌ సినిమాకు, గద్దలకొండ గణేష్ సినిమాకి చేసిన హడావిడి లేకపోయినా సినిమా అభిమానులు మాత్రం రెండు సినిమాలని ఆదరించారంటే ఒక్క సూర్య చేయబట్టే, సూర్య మీద ఉన్న సినిమా కథ నమ్మకం వల్లనే. సూర్య, కె.వి. ఆనంద్‌ గారి కలయికలో ఇది మూడవ సినిమా, అది కూడా “వీడోక్కడే”, ”బ్రదర్స్” సినిమాలు చూసి జనాలు వీళ్ళ మూడవ కాంబినేషన్ కి ఆశలు పెంచేసుకున్నారు.

నిన్న బందోబస్త్‌ సినిమా చుసిన సూర్య అభిమానులు ఆవేదన వక్తం చేసారు, అవి కూడా సినిమాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నిజానికి సినిమా హిట్ అయ్యే దిశగా ఉన్న కథ. కథ బాగున్నా, కథనం లో లోటుపాటువల్ల పరాజయం అయ్యింది.

వాటిని అభిమానులు బాగా గుర్తుపెట్టుకున్నారు! “హీరోనే టెర్రరిస్ట్ అనుకోని హీరోయిన్ కంగారు అవ్వడం, మోహన్ లాల్ గారు ప్రధాని అయ్యుండి సరిగ్గా కర్తవ్యం విషయం లో పనిచేయకపోవడం, రైతుల గురించి సరిగ్గా అవసరం లేని దగ్గర మాట్లాడటం. అనవసరంగా, అవకాశం లేని వాళ్ళకి లవ్ ట్రాక్ పెట్టడం” ఇలా కొన్ని కొన్ని వాటిని చూసి సూర్య ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేసారు. మరి అవే కదా సినిమాని ఫ్లాప్ చేసినవి.

ఇక మనం కూడా మన తెలుగు సినిమాలలో చూసే ఉంటాం కదా సినిమాలో విషయం లేక కొద్ధిలో ఫ్లాప్ అవ్వడం. అందుకే ఇంత అభిమానం ఉన్న కూడా సూర్య కి ఈ సంవత్సరం “ఎన్.జి.కె”, “బందోబస్త్‌” ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ రావడం నిజంగా బాధే కదా.