`రంగ్‌దే` నుంచి `బ‌స్టాండే.. సాంగ్ వ‌చ్చేసింది!

`రంగ్‌దే` నుంచి `బ‌స్టాండే.. సాంగ్ వ‌చ్చేసింది!
`రంగ్‌దే` నుంచి `బ‌స్టాండే.. సాంగ్ వ‌చ్చేసింది!

`భీష్మ‌` హిట్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ తాజాగా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ ఆ చిత్రాల రిలీజ్‌ల అప్‌డేట్‌ల‌తో త‌న ఫ్యాన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నితిన్ హీరోగా న‌టిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `రంగ్ దే`. కీర్తి సురేష్ హీరోయిన్‌. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి 26 న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే పూర్తయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. దీంతో చిత్ర బృందం ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌ని జెట్ స్పీడుతో ప్రారంభించేసింది. అందులో భాగంగా ఈ చిత్రం నుండి `బస్ స్టాండే…. ` అంటూ సాగే కొత్త పాటని శ‌నివారం విడుద‌ల చేసింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన `బస్ స్టాండే` సాంగ్ చాలా ఫన్నీ సాహిత్యంతో వినోదభరితమైన విజువల్స్‌తో సాగిన‌ట్టుగా తెలుస్తోంది. సినిమాలో కీర్తి సురేష్‌ను వివాహం చేసుకున్న తర్వాత నితిన్‌ జీవితం ఎలా కఠినంగా మారిందో విజువల్స్‌లో చూపించారు. ఈ పాట‌ని సాగర్ ఆల‌పించ‌గా, శ్రీమణి సాహిత్యం అందించారు.