మినీ రివ్యూ: బట్టల రామస్వామి బయోపిక్కు

మినీ రివ్యూ: బట్టల రామస్వామి బయోపిక్కు
మినీ రివ్యూ: బట్టల రామస్వామి బయోపిక్కు

చిన్న సినిమాలకు సరైన వేదికగా నిలుస్తోంది ఓటిటి. జీ5 ప్లాట్ ఫామ్ లో ఇటీవలే విడుదలైన చిత్రం బట్టల రామస్వామి బయోపిక్కు. ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

రామస్వామి (అల్తాఫ్ హుస్సేన్)కు జీవితంలో చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. తాను శ్రీరాముడిలా ఏక పత్నీవ్రతుడు అవ్వాలనుకుంటాడు. అలాగే తన చీరల వ్యాపారం సాఫీగా సాగిపోవాలని కలలు కంటాడు. ఇదిలా ఉంటే జయప్రద (శాంతి రావు)ను తొలిచూపులోనే ఇష్టపడతాడు రామస్వామి. ఆమెను ఒప్పించి కులాంతర వివాహం చేసుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో జయప్రద చెల్లెలు జయసుధను పెళ్లి చేసుకోవడమే కాకుండా పక్క ఊర్లో ఉండే శ్రీదేవిని కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

ఒక్క భార్య మాత్రమే కావాలనుకునే రామస్వామికి మూడు పెళ్లిళ్లు ఎందుకు జరిగాయి? ఆ తర్వాత అతను ఎదుర్కునే పరిస్థితులు ఏంటి అన్నది మిగతా కథ.

ముగ్గురు భార్యల మధ్యన నలిగిపోయే రామస్వామి పాత్రలో అల్తాఫ్ హుస్సేన్ బాగా నటించాడు. మిగిలిన వారు అందరూ కొత్త వారు అయినప్పటికీ తమ పరిధి మేర బాగానే చేసారు. భద్రం కామెడీ బాగుంది. పిఎస్కె మణి కెమెరా వర్క్, రామ్ నారాయణ్ సంగీతం ఇంప్రెస్ చేస్తాయి. దర్శకుడు రామ్ నారాయణ్ పాత కథనే కొత్తగా చెప్పాలని ప్రయత్నించాడు కానీ ఒక బిగిలా చెప్పడంలో విఫలమయ్యాడు. బట్టల రామస్వామి బయోపిక్కు తప్పకుండా చూడాల్సిన చిత్రమైతే కాదు.