యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకు నటించలేదంటే

Behind the reason why Jr.ntr not part of NTR biopic

ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటాడా ? లేదా ? అన్న అనుమానం ఉండేది కానీ తాజాగా కళ్యాణ్ రామ్ చెప్పిన విషయాన్నీ బట్టి ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ లేడని తెలిసిపోయింది . అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ నటించకపోవడానికి కారణం కూడా చెప్పాడు . ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉంది , కానీ ఆ ఇమేజ్ కి తగ్గట్లుగా బయోపిక్ లో పాత్ర లేకపోవడంతో ఎన్టీఆర్ ని తీసుకోవద్దని బాలయ్య అనుకున్నాడట . దాంతో ఎన్టీఆర్ లో ఎన్టీఆర్  లేకుండాపోయాడు .

 

అయితే కళ్యాణ్ రామ్ మాత్రం హరికృష్ణ పాత్రలో నటించాడు . తన తండ్రి పాత్రని పోషించే అదృష్టం తనకు దక్కడంతో చాలా సంతోషంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్ . ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ లేకపోయినా కనీసం వాయిస్ ఓవర్ అయినా ఇస్తాడని అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు దాంతో ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కూడా ఉంటే బాగుండేదని భావిస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ .

English Title: Behind the reason why Jr.ntr not part of NTR biopic