నేల టిక్కెట్టు వెనుక అసలు కథ


behind story of nela ticket

సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కళ్యాణ్ కృష్ణ అయితే అసలు ఇతగాడు దర్శకుడిగా పరిచయం కావాల్సింది రవితేజ సినిమాతో అలాగే ” నేల టిక్కెట్టు ” అనే సినిమాతో కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అన్నట్లుగా రవితేజ కు ఉన్న కమిట్ మెంట్స్ వల్ల నేల టిక్కెట్టు అప్పట్లో ప్రారంభం కాలేదు , రవితేజ డేట్స్ ఖాళీ లేకపోవడంతో అదే సమయంలో నాగార్జున ఛాన్స్ ఇవ్వడంతో సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం చేసాడు అది బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో మళ్ళీ నాగార్జున ఛాన్స్ ఇచ్చాడు కట్ చేస్తే రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా చేసాడు కళ్యాణ్ కృష్ణ .

ఈలోపు రవితేజ కమిట్ మెంట్స్ పూర్తయిపోవడంతో కళ్యాణ్ ని పిలిచాడు నేల టిక్కెట్టు చేద్దామని చెప్పాడు . దాంతో ఇప్పుడు నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రవితేజ – కళ్యాణ్ కృష్ణ లు . రేపు ఈ నేల టిక్కెట్టు విడుదల కానుంది . రవితేజ , కళ్యాణ్ కృష్ణ లు ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు . చూడాలి ఈ రిజల్ట్ ఎలా ఉంటుందో .