మహేష్ సినిమా నుండి జగపతి అందుకే తప్పుకున్నాడట


Jagapathi Babu
Jagapathi Babu

మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాలో జగపతిబాబు ని కీలక పాత్రకు ఎంపిక చేసారు , షూటింగ్ కూడా కాశ్మీర్ లో జరుగుతోంది దాంతో అక్కడికి వెళ్ళాడు జగపతిబాబు . అయితే మొదట చెప్పిన కథ కు తగ్గట్లుగా తన పాత్ర లేకపోవడం ఒక కారణమైతే తనకు చెప్పిన సన్నివేశాలకు బదులుగా వేరే సన్నివేశాలు చిత్రీకరిస్తుండటంతో కోపంతో రగిలిపోయిన జగపతిబాబు మహేష్ సినిమా నుండి తప్పుకున్నాడట .

చెప్పిన సన్నివేశాలకు బదులుగా వేరే చేయిస్తుంటే ఏ నటుడికైనా కోపం వస్తుంది అదే జగపతి కి వచ్చింది అందుకే సినిమా నుండి తప్పుకున్నాడు . ఇప్పుడు ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసారు దర్శకులు అనిల్ రావిపూడి . సినిమా ప్రారంభంలోనే ఇంత అసంతృప్తి ఉంటే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా ? డౌటే !