జయసుధ పార్టీ మారడానికి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసాడట

Behind the reason Jayasudha political life జయసుధ తెలుగుదేశం పార్టీని వీడి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే . అయితే సడెన్ గా తెలుగుదేశం పార్టీ నుండి జగన్ పార్టీలో చేరడానికి కారణం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కారకుడని సంచలన వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ పత్రిక సంపాదకులు ఆర్కే . కేటీఆర్ ఒత్తిడి వల్లే జయసుధ తెలుగుదేశం కు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిందని ఇందులో అవాస్తవం ఉంటే సవాల్ చేయాలనీ అంటున్నాడు .

 

జయసుధ తొలుత కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది అయితే ఎన్నికల్లో ఓడిపోయాక కొంతకాలం సైలెంట్ గా ఉండి 2016 లో మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరింది . అయితే ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో జయసుధ జగన్ పార్టీలో చేరడం వెనుక పెద్ద మతలబు ఉందని అంటున్నారు . ఏది ఏమైనా జయసుధ కూడా జంపింగ్ జపాంగ్ లలో చేరింది .

English Title : Behind the reason Jayasudha political life