ఆ సినిమా రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ?


హీరో విశాల్ నటించిన అయోగ్య చిత్రం విడుదల వాయిదాపడింది దాంతో విశాల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు . అయోగ్య రిలీజ్ కావడానికి చాలా ప్రయత్నాలు చేసాడు కానీ ఆర్ధిక వ్యవహారాలు కావడంతో పాపం హీరో వల్ల కాలేకపోయింది . అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా పెరగడం ఒక కారణమైతే ఫైనాన్షియర్ లకు సకాలంలో డబ్బు చెల్లించకపోవడం మరో కారణం దాంతో అయోగ్య ఈరోజు విడుదల కాకుండా ఆగిపోయింది

అయోగ్య సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు విశాల్ ఎందుకంటే తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రానికి రీమేక్ ఇది . జూనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ హిట్ బాటలోకి వచ్చేలా చేసిన సినిమా టెంపర్ అలాగే ఇదే టెంపర్ ని హిందీలో సింబా గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది . దాంతో విశాల్ తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నా అంటూ ధీమాగా ఉన్నాడు కట్ చేస్తే ఆర్ధిక ఇబ్బందులతో అయోగ్య రిలీజ్ ఆగిపోయింది