నష్టపోయారు కదా అని ఇచ్చారా


behind the story of aravinda sameta veera raghava overseas rights

అరవింద సమేత వీర రాఘవ చిత్ర ఓవర్సీస్ హక్కులను అజ్ఞాతవాసి చిత్రాన్ని కొనుకున్న లాస్ ఏంజిల్స్ తెలుగు వాళ్లకు ఇచ్చారట ! అయితే భారీ రేటు కి ఇచ్చాం అన్నట్లుగా చెబుతున్నారు మాట వరుసకు . అయితే అజ్ఞాతవాసి చిత్రాన్ని భారీ రేటుకి కొని మొత్తంగా పది కోట్ల కు నష్టపోయారు సదరు వ్యక్తులు దాంతో వాళ్లపై సానుభూతి తో అజ్ఞాతవాసి కి నష్టపోయారు కాబట్టి అని అరవింద సమేత వీర రాఘవ ఓవర్ సీస్ హక్కులను ఇచ్చారట .

అజ్ఞాతవాసి చిత్రానికి దర్శకత్వం వహించింది త్రివిక్రమ్ కాగా ఆ సినిమాని నిర్మించింది చినబాబు దాంతో అరవింద సమేత వీర రాఘవ ఓవర్ సీస్ హక్కులను ఇచ్చారు . ఎన్టీఆర్త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా అందునా రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . పైగా ఎన్టీఆర్ మాస్ లుక్ కి రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది దాంతో అరవింద సమెత వీర రాఘవ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .