రాక్షసుడు రన్ టైం ఎంతో తెలుసాRakshasudu
Rakshasudu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం విడుదలకు సిద్ధమైంది . ఈ సినిమా రన్ టైం ఎంతో తెలుసా ….. రెండున్నర గంటలు . అవును ఈ రాక్షసుడు చిత్ర నిడివి 149 నిముషాలు అంటే రెండు గంటల 29 నిముషాలు అన్నమాట . అంటే రెండున్నర గంటలకు కేవలం ఒక్క నిమిషం తక్కువ .

తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రం కావడంతో పాటుగా కంటెంట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బాగా నచ్చడంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . ఇక విడుదల అయ్యేది రేపే కాబట్టి ఫలితం రేపు ఉదయమే తెలిసిపోనుంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా కే ఎల్ యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించాడు .