బెల్లంకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడుగాBellamkonda is paying more attention on selected films
బెల్లంకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడుగా

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ మొదటినుండీ మాస్ సినిమాలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. సినిమాలు వర్కౌట్ అవ్వకపోయినా మాస్ సినిమాలను వదల్లేదు. అయితే ఇటీవలే బెల్లంకొండ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాక్షసుడు సినిమా హిట్ తన ఆలోచన ధోరణి మారింది. ఇకపై ఏ సినిమా పడితే అది చేయకూడదు అని నిర్ణయించుకున్నాడట. అంతే కాకుండా ఇకపై విభిన్నమైన చిత్రాలే చేయాలని అనుకుంటున్నాడట.

ఎన్ని కథలను వింటున్నా బలమైన వాటికే తన ఓటు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడట. అలాగే స్టార్ దర్శకులు, హీరోయిన్స్ వెంట పడకుండా కేవలం కథను నమ్మి మాత్రమే ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు. అనుకోని విధంగా ఏర్పడిన హిందీ డబ్బింగ్ మార్కెట్ బెల్లంకొండకు వరంలా మారింది. తన ప్రతీ సినిమా హిందీలో డబ్బింగ్ అయ్యి మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటుండడంతో ఆ మార్కెట్ కూడా బెల్లంకొండకు బలాన్ని ఇస్తోంది. అందుకే వచ్చిన మార్కెట్ ను పోగొట్టుకోకూడదని బలమైన కథలకే తన ఓటు అని చెప్పేస్తున్నాడు శ్రీనివాస్.