బెల్లంకొండ సక్సెస్ కోసం రీమేక్స్ పైనే ఆధారపడుతున్నాడా?

బెల్లంకొండ సక్సెస్ కోసం రీమేక్స్ పైనే ఆధారపడుతున్నాడా?
బెల్లంకొండ సక్సెస్ కోసం రీమేక్స్ పైనే ఆధారపడుతున్నాడా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువే. అల్లుడు శీను, రాక్షసుడు తప్ప తన కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. అయినా కానీ భారీ బడ్జెట్ చిత్రాలు, టాప్ హీరోయిన్లు కారణంగా తన ప్రతీ సినిమాకూ క్రేజ్ అయితే వస్తుంది. రీసెంట్ గా బెల్లంకొండ బాలీవుడ్ కు వెళుతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.

టాలీవుడ్ లో ఐకానిక్ హిట్ గా నిలిచిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకుడు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉంటే బెల్లంకొండ మరో రీమేక్ ను అనౌన్స్ చేసాడు. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన కర్ణన్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు.

ధనుష్ నటించిన కర్ణన్ అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇలా వరసగా రీమేక్స్ తో తన కెరీర్ ను నిర్మించుకుంటున్నాడు మన బెల్లం బాబు.