బెల్లంకొండ కవచం ట్రైలర్ టాక్


Bellamkonda Kavacham trailer Talk

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” కవచం ”. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై కవచం సినిమాపై కాస్త అంచనాలు పెంచింది . కాజల్ అగర్వాల్ , మెహరీన్ లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 7న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు . కవచం ట్రైలర్ చూస్తుంటే బెల్లంకొండ ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి . ఈ హీరో సాలిడ్ హిట్ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు .

కానీ ఈ కవచం మాత్రం కమర్షియల్ హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు . ఇక ట్రైలర్ కూడా మాస్ ఆడియన్స్ ని అలరించేలా రూపొందించారు . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా కూడా ఏది లేనందున తప్పకుండా మంచి హిట్ కొడతాం అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర బృందం . బెల్లంకొండ కు ఈ కవచం రక్షణలా నిలబడుతుందా ? లేదా అన్నది ఈనెల 7న తేలిపోనుంది .

English Title: Bellamkonda Kavacham trailer Talk