కోడిరామ‌కృష్ణ‌గారు ఎంద‌రికో స్ఫూర్తి ప్ర‌దాత‌- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌


Bellamkonda sai srinivas about legend director

తెలుగు సినిమా చరిత్ర‌లో వంద చిత్రాల‌కు పైగా దర్శ‌క‌త్వం వ‌హించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభ‌వంలో కోడి రామ‌కృష్ణ‌గారు ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను అందించారు. ఇప్ప‌టికీ ఆయ‌న తీసిన చిత్రాలు మ‌ర‌చిపోలేం.

 

ఎమోష‌న‌ల్ మూవీస్‌, భ‌క్తిచిత్రాలు, పొలిటిక‌ల్ మూవీస్ ఇలా అన్నీ ర‌కాల చిత్రాల‌ను తెర‌కెక్కించారు. తన చిత్రాల‌తో నేటి ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తి ప్ర‌దాత‌గా నిలిచారు కోడిరామ‌కృష్ణ‌గారు. ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు మ‌న‌ల్ని విడిచి పెట్టి వెళ్లిపోవ‌డం బాధాకరం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి.. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

English Title: Bellamkonda sai srinivas about legend director