దిల్ రాజు బ్యానర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్


bellamkonda sai srinivas in dill raju banner
bellamkonda sai srinivas in dill raju banner

అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానికి నాయకా, సాక్ష్యం, కవచం, సీత, అనతికాలంలోనే ఆరు చిత్రాలు చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా డాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నారు.
ఇప్పటి వరకు అల్లుడు శ్రేణు, జయ జానికి నాయకా చిత్రాలు హిట్స్ కాగా మిగిలిన చిత్రాలు అన్నే ప్లాప్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన తన ఏడవ చిత్రం “రాక్షసుడు” ఈ చిత్రం ఇటీవల విడుదలై యునానిమస్ హిట్ టాక్ తో సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది.

ఫస్ట్ టైం శ్రేనివాస్ గుడ్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలనని నిరూపించుకున్నాడు శ్రేనివాస్. రాక్షసుడు చిత్రం డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కి లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సక్సెస్ తో శ్రీనివాస్ తో మరిన్ని సినిమాలు తీయడానికి పలువురు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇమ్మీడియట్ గా శ్రీనివాస్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయనున్నాడు.

ఈ విషయం స్వయంగా తన తండ్రి బెల్లంకొండ సురేష్ వెల్లడించారు. రాక్షసుడు చిత్రం బ్లాక్ బస్టర్ అయినా సందర్బంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.. గత ఐదేళ్లుగా మా అబ్బాయికి హిట్ రావాలని ఎదురు చూస్తున్న నాకు రాక్షసుడు చిత్రం బిగ్ హిట్ కావడం నాకు ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు.

తెలుగులో మా అబ్బాయి శ్రీనివాస్ నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవచ్చు కానీ హిందీలో డబ్ అయి పెద్ద హిట్స్ అయ్యాయి. యూట్యూబ్ లో 200మిలియన్స్ పైగా చూసారు. త్వరలో ఒక పెద్ద బ్యానర్ వాళ్ళు మా బాబుతో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఆ వివరాలు త్వరలో చెప్తాను అంటూ మీడియాతో మాట్లాడారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.