తమిళ్ హిట్ రీమేక్ టాలీవుడ్ లో


Bellamkonda Sai Srinivas in Tamil remake

తమిళంలో హిట్ అయిన రాక్షసన్‌ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్నట్లు తెలుస్తోంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు , అయితే అల్లుడు శీను చిత్రం తప్ప మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి . అయినప్పటికీ భారీ సినిమాలను చేస్తూనే ఉన్నాడు ఈ హీరో అయితే సక్సెస్ మాత్రం దక్కడం లేదు అందుకే తమిళ రీమేక్ పై దృష్టి పెట్టాడు .

తాజాగా ఈ హీరో తేజ దర్శకత్వంలో సీత అనే చిత్రంలో నటిస్తున్నాడు . కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సీత చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఆ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడు బెల్లంకొండ . అందులోనే ఒక చిత్రాన్ని రాచ్చసన్ అనే చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .

English Title: Bellamkonda Sai Srinivas in Tamil remake