ఆ సినిమా వాయిదాపడటం లేదట


Bellamkonda Sai Srinivas Kavacham release date confirmed

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం కవచం . పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 7 న విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు . కొద్దిరోజులుగా కవచం విడుదల వాయిదా పడనుంది అని గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే మేము చెప్పిన సమయానికి వస్తున్నాం కన్ఫర్మ్ అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు . సక్సెస్ కోసం తహతహలాడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ , మెహరీన్ లు నటించారు . ఇక విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటించాడు .

శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . తనయుడిని హీరోగా నిలబెట్టాలని , స్టార్ హీరోని చేయాలనీ కలలు కంటున్నాడు . ఇప్పటివరకు చేసిన సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్ కానీ సక్సెస్ మాత్రం దక్కలేదు దాంతో కవచం చిత్రంతో తప్పకుండా హిట్ కొడతాం అన్న ధీమాతో ఉన్నారు . డిసెంబర్ 7 న కవచం తో పాటుగా పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి . మరి వాటిలో ఏది హిట్ అవుతుందో ? ఎన్ని ప్లాప్ అవుతాయో ?

English Title: Bellamkonda Sai Srinivas Kavacham release date confirmed