పైరసీ బారిన పడిన రాక్షసుడుRakshasudu
Rakshasudu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం పైరసీ బారిన పడింది . తమిళ రాకర్స్ రాక్షసుడు చిత్రాన్ని ఆన్ లైన్ లో పెట్టేసారు . దాంతో ఈ సినిమా వసూళ్ల పై అది ప్రభావం చూపించనుంది . నిన్న భారీ ఎత్తున విడుదలైన రాక్షసుడు చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది . దాంతో బెల్లంకొండ కుటుంబం చాలా సంతోషంగా ఉంది . ఎన్నాళ్ళుగానో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు అది రాక్షసుడు రూపంలో వచ్చినందుకు ఖుషీ అవుతున్నారు .

అయితే వాళ్ళ సంతోషం పై నీళ్లు చల్లుతూ తమిళ రాకర్స్ పైరసీ చేయడంతో ఖంగుతిన్నారు . విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే సినిమా మొత్తాన్ని పైరసి చేసి పడేస్తున్నారు . పైరసీదారుల ఆట కట్టించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొలిక్కి రావడమే లేదు .