యంగ్ హీరోకు షాక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్


Bellamkonda sai srinivas shocked with kajal agarwal
Bellamkonda sai srinivas and kajal agarwal

కాజల్ అగర్వాల్ అంటే పడిచచ్చే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి షాక్ ఇచ్చింది . నాకు పెళ్లి మీద గాలి మళ్లింది , ఇప్పుడు చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అయితే సినిమా రంగానికి చెందిన వాడ్ని మాత్రం అస్సలు పెళ్లిచేసుకోను అంటూ చెప్పేసింది కాజల్ అగర్వాల్ , కాజల్ సమాధానంతో కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆశలు గల్లంతు అయినట్లే !

కాజల్ అంటే నాకు చాలా చాలా ఇస్టమని అందరి ముందే చెప్పాడు ఈ కుర్ర హీరో . పైగా కాజల్ తో వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు . కవచం ఆల్రెడీ రిలీజ్ అవ్వగా సీత సెట్స్ మీద ఉంది , అలాగే మరోసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . తాజాగా చెన్నై వెళ్లిన ఈ భామ అక్కడి మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి రివీల్ చేసింది . సినిమా రంగానికి చెందిన వ్యక్తి ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది . లెజెండరీ నటుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది కాజల్ అగర్వాల్ .

English Title: Bellamkonda sai srinivas shocked with kajal agarwal