పెళ్ళికి రెడీ అవుతున్న యంగ్ హీరో


Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళికి రెడీ అవుతున్నాడు . త్వరలోనే ఈ యంగ్ హీరో పెళ్లి జరుగనుందని తెలిపాడు తండ్రి బెల్లంకొండ సురేష్ . సినిమా రంగంలోని వాళ్ళని కాకుండా బయటి వాళ్ళని చూస్తున్నామని త్వరలోనే అన్నీ సెట్ అవుతాయని తెలిపాడు . అంటే ఏడాది లోపు బెల్లంకొండ పెళ్ళికొడుకు అవ్వడం ఖాయం అన్నమాట .

ఇటీవలే రాక్షసుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . రాక్షసుడు చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లో నిర్మించామని అందుకే లాభాలు వచ్చాయని ఇకపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసే సినిమాలు బడ్జెట్ లో చేస్తామని అంటున్నాడు బెల్లంకొండ సురేష్ . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమాలు భారీ వసూళ్లు సాధించినప్పటికీ బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల ఫెయిల్యూర్స్ గా మిగిలాయి అందుకే ఇకపై బడ్జెట్ లో చేస్తామని అంటున్నాడు .