బెల్లంకొండ మొద‌లెట్టాడుగా!


బెల్లంకొండ మొద‌లెట్టాడుగా!
బెల్లంకొండ మొద‌లెట్టాడుగా!

బెల్లంకొండ శ్రీ‌నివాస్ `రాక్ష‌సుడు` త‌రువాత చేస్తున్న చిత్రం `అల్లుడు అదుర్స్‌`. నూత‌నోత్తేజంతో క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం బెల్లంకొండ చేస్తున్న ఈ మూవీని సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కు విశేష స్పంద‌న ల‌భించింది. `అల్లుడు శీను` త‌ర‌హా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కిస్తున్నారు.

న‌భా న‌టేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా మూవీ షూటింగ్ ఆగిపోవ‌డంతో ఈ చిత్ర షూటింగ్ కూడా ఆగిపోయింది. తాజాగా క్రేజీ చిత్రాల షూటింగ్‌లు ఒక్కొక్క‌టిగా తిరిగి ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో `అల్లుడు  అదుర్స్‌` కూడా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.  కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ – ప్ర‌కాష్‌రాజ్‌పై కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేస్తున్నారు.

వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని బ‌రిలో దింపాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ‌ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో `ఇస్మార్ట్ బ్యూటీ` నిధి అగ‌ర్వాల్ ఐట‌మ్ నెంబ‌ర్‌లో ర‌చ్చ చేయ‌బోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని త్వ‌ర‌లో రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్నారు.