బెల్లంకొండ శ్రీనివాస్ నీకు అంతుందా?


bellamkonda srinivas gym workout at gym
bellamkonda srinivas gym workout at gym

బెల్లంకొండ శ్రీనివాస్ “అల్లుడు శ్రీను” చిత్రంతో  యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆరడుగుల హైట్, కండలు తిరిగిన బాడీ గల బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ హీరోకి పర్ఫెక్ట్ మ్యాచ్. ఆయన ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నీ దాదాపు ఆ కోవకు చెందినవే. తాజాగా విడుదలైన “సీత” చిత్రంలో మాత్రం కొంచెం వైవిధ్యమైన పాత్రనుపోషించాడు.. ఇక లేటెస్ట్ గా రాక్షసుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలకానుంది. కాగా..

బెల్లంకొండ శ్రీనివాస్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. శ్రీనివాస్ జిమ్ లో షర్ట్ లేకుండా కండలు తిరిగిన శరీరాన్ని కలిగివున్న ఆ ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఫోటోతో పాటు ఓ మంచి స్ఫూర్తి దాయక మాట కూడా పోస్ట్ చేశాడు. బెల్లంకొండ ప్రస్తుతం నటించిన క్రైమ్ థ్రిల్లర్ “రాక్షసుడు” ఈ ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైంది. అలాగే ఈ చిత్రం తరువాత ఆయన ఒకప్పటి స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయో పిక్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.. ఈ చిత్రం విశేషాలు అతి త్వరలో ప్రకటించనున్నారు దర్శక,నిర్మాతలు..!!