ఒక్క హిట్ కే బెల్లంకొండ ఇంత చెప్తున్నాడేంటి?ఒక్క హిట్ కే బెల్లంకొండ ఇంత చెప్తున్నాడేంటి?
ఒక్క హిట్ కే బెల్లంకొండ ఇంత చెప్తున్నాడేంటి?

తన కెరీర్ లో మొదటి సినిమాతో యావరేజ్ సినిమాను అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత నుండి ప్రతీ సినిమా నిరాశనే మిగిల్చింది. అయితే ఎట్టకేలకు ఒక రీమేక్ తనకి ఊరటనిచ్చింది. రాక్షసుడు సినిమా సాధించిన విజయం బెల్లంకొండ కెరీర్ కు కొత్త ఊపిరిలూదింది. అయితే ఈలోగా బెల్లంకొండకు అనుకోని మేలు జరిగింది.

ఎలా జరిగిందో తెలీదు కానీ బెల్లంకొండకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో సరికొత్త మార్కెట్ వచ్చింది. అతని సినిమాలు హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా 6 నుండి 7 కోట్లు పలుకుతున్నాయి హిందీ మార్కెట్ లో. అలాగే ఇక్కడ డిజిటల్ స్ట్రీమింగ్, థియేట్రికల్ రైట్స్ కింద ఈజీగా 7 నుండి 8 కోట్లు రాబట్టొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతకు దాదాపు 14 కోట్లు పాకెట్ లో ఉంటాయి.

దీంతో బెల్లంకొండ తన పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ సినిమాకు 10 కోట్లు అయితేనే సినిమా చేద్దాం లేకుంటే లేదు అనేస్తున్నాడట. ఇన్నాళ్లు బెల్లంకొండ సురేష్ ఫైనాన్సియల్ సపోర్ట్ తో తన సినిమాలు తెరకెక్కేవి కానీ ఇప్పుడు బయట నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. అందుకే డిమాండ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని బెల్లంకొండ అమాంతం 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.

మీడియం రేంజ్ హీరోలు కూడా అంత తీసుకోవట్లేదు ప్రస్తుతం ఇండస్ట్రీలో. ఆరేడు కోట్లు అయితే బెల్లంకొండతో చేయొచ్చు కానీ అంతకుమించి అంటే చాలా కష్టం, అతని సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ జరగడం కష్టం అన్న భావనలో ఉన్నారు నిర్మాతలు. మరి బెల్లంకొండ తగ్గుతాడా లేదా అన్నది చూడాలి.