బెల్లంకొండ కొత్త మూవీ టైటిల్‌ అదుర్స్‌!


 బెల్లంకొండ కొత్త మూవీ టైటిల్‌ అదుర్స్‌!
బెల్లంకొండ కొత్త మూవీ టైటిల్‌ అదుర్స్‌!

`రాక్ష‌సుడు` ట్రెంమండ‌స్ హిట్ త‌రువాత బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ నుంచి ఎలాంటి సినిమా రాబోతోందా? అని ఆడియ‌న్స్‌లో ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే ఈ సినిమా త‌రువాత బెల్లంకొండ శ్రీ‌నివాస్ `కందిరీగ‌` చిత్రంతో మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న యువ ద‌ర్శ‌కుడు, క‌మ్ సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రాన్ని మొద‌లు పెట్టారు. నూతాన నిర్మాణ సంస్థ సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గొర్రేల సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఫేమ్ న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 29న ప్రారంభ‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 6 నుంచి నిర‌వ‌ధికంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి `అల్లుడు అదుర్స్‌` అనే టైటిల్‌ని గురువారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌క్కా మాస్ మాసాలా అంశాల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

టైటిల్ ఫ‌స్ట్‌లుక్ తో పాటు చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. ప్ర‌కాష్‌రాజ్‌, రాయ్‌ల‌క్ష్మీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, ఆర్ట్ అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్ త‌మ్మిరాజు, యాక్ష‌న్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌, మాట‌లు: శ్రీ‌కాంత్ విస్సా.