బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి రీమేక్ అనౌన్స్మెంట్బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి రీమేక్ అనౌన్స్మెంట్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి రీమేక్ అనౌన్స్మెంట్

గతేడాది రాక్షసుడు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బెల్లంకొండ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

పెన్ మూవీస్ తెరకెక్కించనున్న ఛత్రపతి రీమేక్ లో బెల్లంకొండ నటించబోతున్నాడు. శ్రీనివాస్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన వివి వినాయక్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పరిచయం చేసే బాధ్యతలను తీసుకున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి ఎంత పెద్ద హిట్ అన్న విషయం అందరికీ తెలుసు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఛత్రపతి రీమేక్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.