పది లక్షల విరాళం ఇచ్చిన బెల్లంకొండ


Bellamkonda Suresh Donates 10 lakshs
Bellamkonda Suresh Donates 10 lakshs

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ,హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లు పది లక్షల విరాళాన్ని ఫిలిం జర్నలిస్ట్ లకు అందించారు .

ఇకనుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించే ప్రతీ సినిమాకు పది లక్షల విరాళాన్ని అందిస్తామని ప్రకటించాడు .

అంతేకాదు ఫిలిం జర్నలిస్ట్ లు చిత్ర రంగానికి బాగా కావాల్సిన వాళ్ళు అందుకే అందరూ కలిసి మెలిసి ఉండి మీరంతా బాగుండాలని కోరుకుంటున్నానన్నాడు .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు మంచి హిట్ కావడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా వాడికి మంచి హిట్ వచ్చింది , అలాగే మంచి సినిమా చేసావ్ అనే పేరు వచ్చింది అందుకే ఇకపై ప్రతీ సినిమాకు పది లక్షల విరాళాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించడమే కాకుండా పది లక్షల చెక్ లను అందించాడు .